ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు అధికమవుతున్నారు. భారతదేశంలో కూడా డయాబెటిస్ కు సంబంధించి 10 కోట్ల మందికి పైగా రోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా భారత్ లో రెండు రకాల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. అందులో టైప్ 1, టైప్ 2 గా ఉన్నాయి. దీంతో ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్న రోగికి.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ రోగులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.
Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు.. క్లారిటీ ఇచ్చిన పవన్
డయాబెటిస్ వ్యాధి సాధారణ వ్యక్తుల కంటే ఆ వ్యాధితో బాధపడుతున్న రోగులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 2 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ రోగుల్లో హైబీపీ మరియు కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాంతో వారు ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ గుండెపోటుకు గురవుతారు. డయాబెటిక్ రోగుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అధికమే. ఆ కారణంగా గుండె యొక్క సిరల్లో అడ్డుపడటం వస్తుంది. ఇది గుండెకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయి. డయాబెటిక్ రోగులలో, ఎండోథెలియం అని పిలువబడే సిరల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఫలకాలు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
Bulldozer Action: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. నిందితుడి ఇల్లు కూల్చివేత
మధుమేహం వల్ల గుండె నరాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. డయాబెటీస్ రోగులకు అధిక LDL కొలెస్ట్రాల్ ఉంటుంది. మధుమేహం ఉన్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కూడా రావచ్చు. దీనితో గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం బీపీని అదుపులో ఉంచుకోవడంతోపాటు కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు క్రమం తప్పకుండా తీసుకోండి. రోజువారీ వ్యాయామం, ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. స్ట్రీట్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాన్ని తినవద్దు. ప్రతి రెండు మూడు రోజులకోసారి మీ బీపీని చెక్ చేస్తూ ఉండండి.