Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రం “ధురంధర్”. ఇప్పటికే రూ.500 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం రూ.1000 కోట్ల దిశగా శరవేగంగా దూసుకువెళ్తుంది. ఈ చిత్రంపై సినీ పెద్దల నుంచి ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు.
READ ALSO: Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం చుట్టూ వివాదం..
ఈ సెన్సేషనల్ హిట్ సినిమాపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా స్పెషల్ రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయిందని, ఈ చిత్రంలో కీ రోల్స్ ప్లే చేసిన రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా వారి పాత్రల్లో జీవించారని, ఈ సినిమాకు అన్నీ టాప్‌లో కుదిరాయని, ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు డైరెక్టర్ ఆదిత్య ధర్‌కి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన డైరెక్టర్..
థాంక్యూ డియర్ సందీప్. ‘ధురంధర్’ సినిమాని ఎంతో నమ్మకంతో, నిజాయితీగా రూపొందించాం. మీ మాటలు ఆ ప్రయాణానికి ఒక నిశ్శబ్ద గుర్తింపును ఇచ్చాయి. మీ నుంచి ఈ ప్రశంసలు రావడం నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా పట్ల మీకున్న అంకితభావాన్ని, ఎక్కడా రాజీ పడని మీ శైలిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. భారతీయ సినిమా నిజాయితీగా, మూలాలను మరవకుండా బలంగా ఉండేలా చేసే మీలాంటి గొంతుకలు ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. సినిమా ఎప్పుడూ ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది, అందరినీ మెప్పించే వారిని కాదు” అంటూ డైరెక్టర్ ఆదిత్య ధర్ రిప్లై ఇచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైన ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
READ ALSO: Instagram Love Tragedy: ఇన్స్టాలో పరిచయం.. రెండేళ్లు సహజీవనం.. యువతి సూసైడ్!
