Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతువర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నక్షత్రం. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టి ఎన్నేళ్లు అవుతుందో కూడా అభిమానులు మర్చిపోయారు. ఈ ఏడాది రిలీజ్ అంటే.. వచ్చే ఏడాది.. ఆ పై వచ్చే ఏడాది అనుకుంటూ 5 ఏళ్ళు దాటించేశారు. సినిమా పూర్తి అయ్యి అనౌన్స్ మెంట్ ఇచ్చేసరికి రెండేళ్లు.. ట్రైలర్ రిలీజ్ అయ్యి రిలీజ్ డేట్ చెప్పేసరికి మరో మూడేళ్లు పట్టాయి. ఇక జూలై .. అంటే ఈ నెలలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని గతేడాది ప్రకటించారు. కానీ, ఈ ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ ఉండదని వార్తలు వస్తున్నాయి. అవును.. మళ్లీ ధృవ నక్షత్రం రిలీజ్ వాయిదా పడిందని నెట్టింట న్యూస్ లీక్ అయ్యింది. దీంతో విక్రమ్ అభిమానులు.. ఓరీ.. బాబో.. మళ్లీ వాయిదా ఏంట్రా బాబు.. ? అంటూ నెత్తి కొట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఓటిటీకి అన్నా ఇచ్చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Ram Charan: బాలీవుడ్ వెబ్ సిరీస్ లో చరణ్.. దీపికా, త్రిషలతో ప్రోమో అదిరింది
ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్ జాన్ అనే అత్యంత శిక్షణ పొందిన భారతీయ గూఢచారి పాత్రను పోషిస్తున్నాడు. అతను మారువేషంలో భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే ఇక సినిమా మీద ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి త్వరలో మేకర్స్ ఏమైనా అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.