తమిళ స్టార్ హీరో విక్రమ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్.. ఆదిత్య వర్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేదు.. దాంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ చిత్రంలో నటించారు.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో హీరోగా పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు.. ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ఓ కొత్త సినిమాతో రాబోతున్నాడు..
ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకేక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులైంది. తర్వాత అంతా సైలెంట్‌గా ఉండటంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.. కబడ్డీ నేపథ్యంలో లో రూపోందుతున్న ఈ సినిమా కోసం దృవ్ ప్రత్యేక శిక్షణ పొందుతూన్నాడు..
ఈ సినిమాలో హీరోకు జోడిగా మల్లు బ్యూటీ దర్శనా రాజేంద్రన్ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ మార్చి 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేసెయ్యాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. మరి ఈ సినిమా అన్న అతనికి సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి..