Dharmendra : హేమమాలినితో రెండో పెళ్లికి వెనకున్న నిజాలు, అప్పటి హాట్ టాపిక్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1935లో పంజాబ్‌లో జన్మించిన ఆయన, 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు అనేక క్లాసిక్ సినిమాలు అందించారు. ఆయన మొదటి పెళ్లి – కుటుంబం గురించి మాట్లాడు కుంటే కేవలం 19 ఏళ్ల వయసులో ధర్మేంద్ర, ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటు కుమార్తెలు విజేత, అజిత అన్నారు. మరి..
Also Read : Ustaad Bhagat Singh :‘ఉస్తాద్ భగత్ సింగ్’..‘తేరి’ రీమేక్ టాక్‌పై నిర్మాత క్లారిటీ!
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
హేమమాలినితో ప్రేమ ఎలా మొదలైంది? అంటే.. 1970లలో హేమమాలిని తో వరుసగా చేసిన సినిమాలు ఈ జంటను దగ్గర చేశాయి. సీతా ఔర్ గీత, షోలే వంటి హిట్లతో వీరి కెమిస్ట్రీ అప్పటికే పబ్లిక్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి సమాచారం ప్రకారం ‘షోలే’ షూటింగ్ సమయంలో హేమాను కౌగిలించుకునే సీన్స్ కోసం మరిన్ని టేకులు రావాలని చూస్తూ ధర్మేంద్ర, లైట్‌బాయ్స్‌కి డబ్బులు ఇచ్చేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో ఆయన ఇందుకోసం రూ. 2000 వరకు ఖర్చు చేశారని బాగా ప్రచారం జరిగింది.
రెండో పెళ్లి ఎలా జరిగింది? అంటే ధర్మేంద్ర హేమమాలినిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ అంగీకరించలేదు. అప్పుడు మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి, దిలావర్ ఖాన్ అనే పేరుతో 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఒక భార్య ఉన్నప్పుడు రెండో పెళ్లి చేయడానికి ఇస్లాం చట్టం అనుమతిస్తుంది కాబట్టి, అదే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పటి కథనాలు చెప్పాయి. కానీ,
ఈ వ్యవహారం ధర్మేంద్ర మొదటి కుటుంబం ముఖ్యంగా సన్నీ డియోల్, బాబీ డియోల్ పై చాలా ప్రభావం చూపింది. కొంతకాలం వరకు ధర్మేంద్ర రెండు కుటుంబాల్ని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది పడ్డారు అనే కథనాలు పాపులర్ అయ్యాయి. మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఎప్పుడూ ఆయనపై నెగెటివ్‌గా మాట్లాడలేదు, కానీ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు అప్పట్లో హెడ్లైన్స్ అయ్యాయి.. “ధర్మేంద్ర మంచి తండ్రి, తన బాధ్యతల్ని చూసుకుంటాడు. కానీ ఒక భార్యగా నా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.” అని మొత్తానికి హేమమాలినితో రెండో పెళ్లి అలా జరిగింది.
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!