Dharmendra: మీడియా చంపేసిన నటుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో వార్తలు అందరికన్నా ముందు మేమే అందించాలనే ఉద్దేశంతో మీడియా సంస్థలు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మానేశాయి. ఈ నేపథ్యంలోనే, నిన్న శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర మరణించినట్లుగా బాలీవుడ్‌లో ముందు ప్రచారం మొదలైంది. అది నిజమేనని తెలుగు మీడియా పోర్టల్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి. అయితే, ఇదే విషయాన్ని ఖండిస్తూ ఆయన కుమార్తెలలో ఒకరైన హీరోయిన్ ఈషా డియోల్ స్పందించారు. “దయచేసి మా తండ్రి గురించి ఇలాంటి వార్తలు రాయకండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంతలోనే ఇలా మరణించారు అనే వార్తలు దయచేసి పుట్టించకండి” అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read : Spirit: బాక్సాఫీస్ బాడీ పల్స్ తెలిసినోడు వచ్చేశాడు
Also Read
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
ఇక, ధర్మేంద్ర భార్య హేమమాలిని సైతం “ఇది ఏమాత్రం క్షమించరానిది” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చాలా బాధ్యతగా మెలగాల్సిన మీడియా సంస్థలు సైతం ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇలా వార్తలు ప్రచురించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్రను బతికుండగానే మీడియా చంపేసింది. ఇక ఆయన పరిస్థితి నిలకడగా ఉండడంతో, ఈరోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు.
తాజావార్తలు
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
-
Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
-
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
-
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!