Site icon NTV Telugu

Dharmapuri Sanjay : మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారు

Dharmapuri Sanjay

Dharmapuri Sanjay

కాంగ్రెస్‌ నాయకులు ధర్మపురి సంజయ్‌ నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కడుపున పుట్టినంత మాత్రాన రాజకీయ వారసత్వం రాదని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో మా నాన్న డీఎస్ చేరినప్పుడు, ఓ అనుచరుడు గా మా నాన్న తో కలిసి వెళ్ళానని, ఏ రోజూ బీఆర్ఎస్ లో క్రీయశీలకంగా పనిచేయలేదన్నారు సంజయ్‌. నేను పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నన్ను కూడా సస్పెండ్ చేసిందని, నేనెప్పుడు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Nenu Super Woman: ”ఆహా” అనిపిస్తున్న ”నేను సూపర్ ఉమన్”..3 వారాల్లో 3 కోట్ల 90 లక్షల పెట్టుబడులు

సోనియా గాంధీ ని కలిసి ఆశీర్వదించాలని కోరానని, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయని సోనియా గాంధీ చెప్పారన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత సోనియా గాంధీ ని ఈరోజు కలిశానని, నిజామాబాద్ మేయర్‌గా ప్రజల మనసుల్లో ప్రేమ, అభిమానం ఉందని ఆయన అన్నారు. తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారనే విశ్వాసం ఉందని, సోదరుడు అరవింద్ ఎంపీ గా గెలవడానికి అప్పటి పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు బాధ్యతలు ఇస్తే తప్పకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ఎన్నికల్లో పోటీ చేసే అంశం పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇంకా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈరోజు, రేపు కలుస్తానని ఆయన తెలిపారు.

Also Read : Minister Adimulapu Suresh: గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా?

Exit mobile version