Dharmapuri Arvind: త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి లో ఎంపీ అరవింద్ ఎన్నికల కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోవాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు.
కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. మూడు నెలల తర్వాత రేషన్ కార్డుల కోసం ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందన్నారు. అవినీతిని పెంచి పోషించింది.. అందుకే అధికారం కోల్పోయిందన్నారు. మోడీతోనే సుస్థిర పాలన సాధ్యం అన్నారు. దేశమంతా మోడీ పాలన కోరుకుంటున్నారని తెలిపారు.
Read also: KTR: మతం పేరుతో రాజకీయం చేస్తే వారిని నమ్మకండి..
కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదని నిన్న ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ లపై కాంగ్రెస్ నేతలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఫ్యాక్టరీలు తెరిపించాలనే ఉద్దేశ్యం ఆ పార్టీకి లేదన్నారు. కేవలం ఎన్నికల స్టెంట్ మాత్రమే అన్నారు. చేరకు రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామా అని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంక్ బకాయిలతో పాటు ప్రైవేటు భాగస్వామి కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు.
రిజర్వేషన్ల పై కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలతో ఎస్సి, ఎస్టీ, బిసిలు బలవుతున్నారన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదన్నారు. 2 లక్షల ఋణ మాఫీ ఇస్తానని రేవంత్ ప్రమాణాలు చేస్తుంటే పార్టీ మాత్రం కమిటీ వేస్తామని అంటోందన్నారు. ఆత్మాభిమానం ఉంటే మంత్రులు, సభ్యులు షుగర్ ఫ్యాక్టరీ కమిటీ లకు రాజీనామా చేయాలన్నారు.
NEET Exam 2024: రేపే నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..