Site icon NTV Telugu

IndiGo-DGCA: ఇండిగో కష్టాలకు డీజీసీఏ చెక్.. వారం పాటు కొత్త నిబంధనలు ఎత్తివేత

Indigo Flights5

Indigo Flights5

హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.

ఇది కూడా చదవండి: Modi-Putin: తటస్థం కాదు.. శాంతికే మొగ్గు.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మోడీ వ్యాఖ్య

నవంబర్ 1 నుంచి కొత్త కఠినమైన డ్యూటీ-టైమ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇండిగో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కొరత ఏర్పడింది. పైలట్లకు తప్పనిసరి విశ్రాంతి అవసరాల నిబంధన అమల్లోకి రావడంతో ఇండిగోలో సంక్షోభం తలెత్తింది. కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్ ల్యాండింగ్ ప్లాన్, వీక్లీ రెస్ట్ చార్టుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో ఇండిగోలో ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్ పూర్తి దెబ్బతింది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా లోటును భర్తీ చేయలేకపోతున్నట్లు చేతులెత్తేసింది. దీంతో గురువారం డీజీసీఏను ఇండిగో అధికారులు కలిసి ఆంక్షలు ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా వారం పాటు కొత్త నిబంధనలు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో విమాన సర్వీసులు పునరుద్ధరణ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులగా ఎయిర్‌పోర్టుల్లోనే తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.

ఇది కూడా చదవండి: Maoist Party: హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Exit mobile version