పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర.ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మరియు అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. యుంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవర సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా వున్నాయి.ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..ఎప్పుడెప్పుడు చూసేద్దామ అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఈ మూవీకి సబంధించి నిత్యం ఏదో ఒక వార్త బాగా వైరల్ అవుతూ వస్తోంది..
దేవర సినిమాకు సంబంధించిన నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దేవర మూవీ టీమ్ అఫీషియల్ గా సమాధానం కూడా ఇచ్చింది.దేవర సినిమా అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్ వర్షన్ లో కూడా విడుదల అవుతుందా అంటూ సోషల్ మీడియాలో ఒకరు పెట్టిన పోస్ట్ కి.. దేవర టీమ్ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త నిజం కాదని దేవర అఫీషియల్ టీమ్ తెలిపారు.. దేవర మూవీ ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వడం లేదని ఇలాంటి రూమర్స్ నమ్మకండి అని వారు తెలిపారు.. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా దేవర సినిమా లో అతని లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది. దేవర సినిమా 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.ఈ సినిమా తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.