Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!
- సెప్టెంబర్ 27న దేవర
- దేవర కథ కొత్త కాదు
- సినిమాలో కొత్తగా ఏముంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు మంచి ఇమేజ్ ఉంది. ‘ఆచార్య’ కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆయనకు ‘దేవర’ ఓ సవాల్‌గా మారింది. దేవర ట్రైలర్ చూసిన తర్వాత.. ఆచార్య, ఆంధ్రావాలా, దమ్ము సినిమాలతో నెటిజెన్స్ పోలుస్తున్నారు. దానికి తోడు ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది? అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ.. ఈ సినిమాతో కొత్త కొరటాలను చూడబోతున్నామని మాత్రం చెప్పొచ్చు.
కొరటాల శివ తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు సోషల్ కాజ్ జోడించే విధానం బాగుంటుంది. దేవర సోషల్ కాజ్కు దూరం.. పక్కా కమర్షియల్ అని అంటున్నప్పటికీ ఏదో కీ పాయింట్ దాగి ఉన్నట్టుగా ఉంది. కొరటాల హీరోలకు మరో యాంగిల్ ఉంటుంది.. అది ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా? అనేది ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటునే బ్లాస్ట్ అవుతుంటారు కొరటాల హీరోలు. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ గ్యారెంటీ. అంతేకాదు ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇదే కొరటాల స్టైల్ ఆఫ్ మేకింగ్. దేవరలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.
Also Read
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
ఒకే తెగకు చెందిన వారిలో మంచోడు దేవర, చెడ్డోడు భైర. ఈ ఇద్దరు స్నేహితులే కానీ.. ఎప్పుడైతే భైర అక్రమాలు దేవరకు తెలుస్తుందో.. అక్కడే అసలు యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమంలో దేవరను దెబ్బ తీయడానికి భైర ఏం చేశాడు?, దేవర పంతానికి ఎందుకు పోయాడు?, రెండేళ్లు ఎక్కడికెళ్లాడు?, అసలు దేవర బతికే ఉన్నాడా?, తండ్రిపై కొడుక్కి ఎందుకు కోపం? అనేది ఎంగేజింగ్‌గా చూపించగలిగితే కొరటాల సక్సెస్ అయినట్టే. అయితే ట్రైలర్ ప్రకారం ఒకానొక సమయంలో.. దేవరకు ఆ దొంగల గుంపుకు సంబంధం ఏంటనే డౌట్స్ కూడా రాక మానదు. ఇక కొడుకు వర క్యారెక్టర్‌ను చూస్తే.. భయస్తుడుగా ఉంటాడు. అలాంటి పిరికి వాడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందనే హై మామూలుగా ఉండదు. ఇక తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సినిమాకు ఆయుపట్టు అనే చెప్పాలి. అయితే.. తండ్రీ యుద్ధం చేస్తున్నప్పుడు కొడుకు ఎక్కడ ఉన్నాడు?, అసలు దేవర ఆశయం ఏంటి? అనేదే కీ పాయింట్. పైగా పార్ట్2 కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడే ఆన్సర్ దొరకదు. ఓవరాల్‌గా చూసుకుంటే.. దేవరలో హై ఇచ్చే ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉన్నాయనే చెప్పాలి. ఫ్యాన్స్ విజిల్స్ వేసే యాక్షన్, తెలియకుండానే కంట నీరు కార్చే ఎమోషన్స్ మాత్రం పక్కా.
Also Read: Malaika Arora: నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి..!
అయితే ఆచార్యతో దేవర పోలిక, ఎస్ఎస్ రాజమౌళి సినిమా తర్వాత చేసే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను తెగ టెన్షన్ పెడుతున్నాయి. మరి దేవర ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!