పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.దేవర.. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ను పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. అలాగే ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే దర్శకుడు కొరటాల ఈ సినిమాలో కొన్ని సీన్స్ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా అవుతుంది ..అదేమిటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను విఎఫ్ ఎక్స్ టీంకు పంపించినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. అయితే ఇందులో కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాదులో భారీ సెట్స్ వేసి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. గతంలో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీనితో దేవర సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.