Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన తాజా చిత్రం దేవర. వర్కింగ్ డేస్‌లో కూడా ట్రెండ్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తూ మిక్స్డ్ రెస్పాన్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌తో సర్వత్రా సందడి చేస్తోంది. వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ మంచి హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. నేడు అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడే కావడంతో సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. విడుదలైన అన్ని చోట్ల తన జోరు చూపిస్తూ కలెక్షన్ల భీభత్సం సృష్టించడానికి సిద్ధమవతున్నాడు దేవర. ఆల్ రెడీ మార్నింగ్ షోల టికెట్ సేల్స్ లో సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఇదే ట్రెండ్ మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోల పాటు ఎక్స్ లెంట్ గా కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సిని లాభాల దిశగా పరుగును కొనసాగించే అవకాశం ఉంది.
Read Also:Tirumala Laddu Controversy: స్పష్టంగా హామీ ఇస్తున్నా..! తిరుమలలో స్వచ్ఛమైన లడ్డూ తయారీ
ఆల్ రెడీ సినిమా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటంతో, ఈ రోజు మాస్ గ్రోత్ ని చూపించిన తర్వాత వీకెండ్ లో తిరిగి సినిమా రచ్చ చేసే అవకాశం ఉంది, తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ తో సినిమా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఈ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక దేవర చిత్రం ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో యూఎస్ మార్కెట్లో 5.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 46 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం 5వ రోజున నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఆరేళ్లుగా యంగ్ టైగర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ని అందించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతుంది.
Read Also:Jangaon Bathukamma: జనగామ బతుకమ్మకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
#Devara unleashes a box office rampage, roaring past $5.3 Million+ in North America! 🔥💥#BlockbusterDevara #DevaraUSA by @prathyangiraus @hamsinient pic.twitter.com/Cj71Yngslj
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 2, 2024