Jangaon Bathukamma: జనగామ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మను విద్యార్థులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే 700 మంది విద్యార్థులతో 36.2 అడుగుల బతుకమ్మను 24 గంటల్లో తయారు చేశారు. దీంతో 36.2 అడుగుల జనగామ బతుకమ్మ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. గతంలో ఉన్న 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా 700మంది విద్యార్థులు 36.2 అడుగుల బతుకమ్మను చేసి రికార్డ్ బ్రేక్ చేయడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంపాదించుకుంది. దీంతో సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. గత రికార్డును బ్రేక్ చేసిన ఘటన మాకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటే బతుకమ్మ పండుగకు జనగామ సెయింట్ మేరీస్ స్కూల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు.
Read also: Bathukamma Songs: బతుకమ్మ టాప్ సాంగ్స్ ఇవే..
కాగా.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణకు ఈ పండుగ పెద్ద బ్రాండ్ ఇమేజ్‌లాగా డెవలప్ అయింది. గ్రామ స్థాయి నుంచి గ్లోబల్ లెవల్‌కి ఎదిగింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దానిపైన సైతం బతుకమ్మ వీడియో ప్రజెంటేషన్ జరగటం విశేషం. ఈ ప్రదర్శన నిర్వహించిన స్క్రీన్ కూడా వరల్డ్‌లోనే అతి పెద్దదవటం మరో ముఖ్య విషయం. ఈ స్పెషల్ షోను దేశవిదేశాలకు చెందిన లక్షల మంది వీక్షించటం ముందుగా తెలంగాణకు, తద్వారా ఇండియాకు గర్వకారణం అనటంలో ఎలాంటి సందేహం లేదు.