గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర.. ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించానున్నారు.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ ను షూట్ చెయ్యనున్నారు.. ఇటీవల గోవా సెట్స్ కు సంబందించిన ఫోటోలను టీమ్ విడుదల చేసింది.
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ ,దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కరణ్ జోహార్ ఈ నిర్మాణ సంస్థకి ఓనర్. సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది.. దీనికి ఓనర్ అనిల్.. గతంలో ఈ నిర్మాణ సంస్థ బాహుబలి సినిమాని నార్త్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది.. అక్కడ భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..
ఈ ప్రొడక్షన్ నుంచి దేవర రిలీజ్ అవ్వడం ఎంతో ప్రాఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నిర్మాణ సంస్థ ద్వారా నార్త్ లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది.. మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 న విడుదల చేయబోతున్నారు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా నుంచి సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం..