బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా బాగా స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను పొందిన ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమూవీలో మత్స్యకార కుటుంబానికి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించబోతోంది.ఇక ఈ సినిమాతో జాన్వీ కపూర్ కెరీర్ టర్న్ కాబోతుంది.ఇప్పటి వరకూ తన కెరీర్ లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చిన జాన్వీ.. పక్కా కమర్షియల్ ఫిల్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే.. టాలీవుడ్ నుంచే కాకుండా సౌత్ లో అన్ని భాషల నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి..
ఇప్పటికే దేవర షూటింగ్ కోసం జాన్వీ తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలి అంటే కాస్త ఇబ్బంది పడుతుందట. హైదరాబాద్ కి వచ్చిన తరువాత కూడా హోటల్స్ లో ఉండటం ఆమెకు ఇబ్బందిగా ఉంటుందట. అందుకే ఆమె ఏకంగా హైదరాబాద్ కు మకాం మార్చి కొన్నిరోజులు ఇక్కడ.. కొన్ని రోజులు ముంబయ్ లో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటుందని సమాచారం. ఇక్కడ వరుసగా సినిమాలలో బిజీ అయితే ఎక్కువ రోజులు ఉండటానికి సౌత్ లో తనకంటూ సొంత ప్రాపర్టీ ఉండేలా ప్లాన్ చేస్తుందట. అందుకే ఆమె హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దేవర సినిమా షూటింగ్స్ కోసం జాన్వీ ఏకంగా హైదరాబాదులో ఉండటానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.జర్నీ చేయడం వల్ల తాను షూటింగ్ పై ఫోకస్ చేయలేకపోతున్నానని అందుకే ఇక్కడే ఉంటే ప్రశాంతంగా సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.