NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో విధ్వంసం..భారతీయులకు ఎంబసీ కీలక సూచన

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు కాస్త రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక నిర్దిష్ట విభాగానికి ఇచ్చిన కోటా (రిజర్వేషన్)కి వ్యతిరేకంగా విద్యార్థులు బలమైన ప్రదర్శనలు, విధ్వంసం సృష్టిస్తున్నారు.

READ MORE: Jagapathi Babu: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను.. జగ్గు భాయ్ పోస్ట్ వైరల్..

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం 56 శాతం రిజర్వేషన్ విధానం ఉంది. ఇందులో 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలు మరియు కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ ఉంది. 10% పరిపాలనా జిల్లాలు, 10% మహిళలు మరియు 5% జాతి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో శారీరక వికలాంగులకు 1 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన కారులు కోరుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలో 6 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా కళాశాలలను, పాఠశాలలను, మదర్సాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ తెరవొద్దని సూచించారు. మరోవైపు, గురువారం దేశవ్యాప్త బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

READ MORE:UTTAR PRADESH: రాజకీయ దుమారంగా మారిన “కన్వర్ యాత్ర” రూల్స్.. ‘‘యాంటీ ముస్లిం’’ అంటూ విమర్శలు..

ఈ నేపథ్యంలో భారత ఎంబసీ అక్కడున్న భారతీయులకు కీలక ప్రకటన జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత కమ్యూనిటీకి చెందిన పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని తెలిపింది. ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితులను వీలైనంత తగ్గించుకోవాలంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే హైకమిషన్‌, అసిస్టెంట్‌ కమిషన్స్‌ను సంప్రదించాలని వెల్లడించింది. 24 గంటల ఎమర్జెన్సీ నంబర్లను కూడా విడుదల చేసింది.