Deputy CM Pawan Kalyan: ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై స్పదించిన పవన్ కల్యాణ్.. చట్ట ప్రకారం చర్యలు..!
- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు..
- సీరియస్‌గా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న పవన్..
- మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం..
- వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. ఆ తర్వాత నెల్లూరులోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.. అయితే, దాడుల సంస్కృతి తమది కాదని.. ఆ దాడితో తమకు సంబంధం లేదని ప్రశాంతిరెడ్డి స్పష్టం చేయగా.. ఇది టీడీపీ వాళ్ల పనే అంటున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.. అయితే, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
Read Also: Tragedy : వీధి కుక్కల దాడిలో వృద్ధుడి మృతి.. వికారాబాద్ జిల్లాలో విషాదం
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు పవన్ కల్యాణ్.. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు.. ప్రశాంతి రెడ్డిపైనా, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పైనా సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయన్నారు.. అయితే, మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!
ఇక, అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు.. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!