NTV Telugu Site icon

Deputy CM Narayana Swamy : పుంగనూరు ఘటన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Deputy Cm Narayana Swamy

Deputy Cm Narayana Swamy

పుంగ‌నూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడి ఒక కన్ను పోగొట్టుకొని, మరొక కన్ను కూడా పోగొట్టుకునే పరిస్ధితిలో ఉన్న రణధీర్ అనే కానిస్టేబుల్ కు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు, తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేడన్న అక్కసుతోనే పధకం ప్రకారం, ముందస్తు ప్రణాళికతో అల్లర్లకు పురిగొల్పాడని ఆయన మండిపడ్డారు.

Also Read : Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

అంతేకాకుండా.. ‘తాము అనుమతి పొందిన రూట్ ను మార్చి పోలిసులపై బీర్ బాటిళ్ళు, రాళ్ళు , కత్తులు, కటార్లతో దాడి చేసారు. ఇంత జరిగినా సమన్వయాన్ని పాటించి , ఎలాంటి ఫైరింగ్ లు లేకుడా అల్లర్లను అణచివేసిన చిత్తూరు ఎస్పీ ని అభినందిస్తున్నాం. ఇంత దారుణానికి పాల్పడిన చంద్రబాబును ఈ కేసులో A1 గా చేర్చాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని చంద్రబాబు ఏమీ చేయలేడు. పోలీసులు ఎందుకు భయపడుతున్నాదో తెలియడం లేదు. చంద్రబాబును మొదటి ముద్దాయి ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నీచమైన, టెర్రరిజం, అభివృద్ది నిరోధక చరిత్ర. చంద్రబాబు హయాంలో ప్రజా సంకల్ప యాత్రలో చిన్న గొడవ జరగలేదు. భవిష్యత్తులో కూడా తన మనుషులను తానే చంపి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. పాకిస్థాన్ లో బెనజీర్ బుట్టోను చేసినట్టే చంద్రబాబు ను చేయాలి. చిత్తూరు ఎస్పీ ని రెడ్ డైరీలో రాసామంటూ పేర్కొన్న లోకేష్ కు రాజకీయాలు తెలియదు. ఈలలేసుకుని తిరిగే పవన్ కల్యాణ్‌ కూడా పోలీసులపై జరిగిన దాడిని ఖండించకపోవడం శోచనీయం. మేము శాంతియుతంగా తిరుగుబాటు చేస్తాం. ఔరంగజేబుకు అన్నగా వ్యవహరిస్తున్న చంద్రబాబు జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు