ఏపీలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే పెన్షన్ల పంపిణీ జరుగుతుంటే దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. పంచాయితీ నిధులను అవసరం మేరకు ప్రభుత్వం వినియోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. టీడీపీ హయాంలో జరగలేదని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెప్పగలరా…? గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, హెల్త్ సెంటర్స్ అభివృద్ధి, పూర్తి స్థాయి సిబ్బంది నియామకం ప్రాధాన్యతగా పెంచుకున్నాం. నీరు చెట్టు…