రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయి.. వీటిని సమన్వయం చేసుకొని తక్కువ సమయంలో పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని పేర్కొన్నారు.
TS Govt: భారీగా టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు..
కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ (LC) తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతాల్లో అది కూడా తక్కువ సమయం LC తీసుకోవాలని.. LC తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్ కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది. ఆ మేరకు సప్లైని ఎలా పెంచుతున్నామని గణంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు.
Indian 2 : ‘ఇండియన్ 2 ‘తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న బడా నిర్మాతలు..
రానున్న మూడు నెలలు విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గమనంలో పెట్టుకొని.. గత నాలుగు నెలలుగా శాఖ పరంగా కసరత్తు చేసి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత పాలకులు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకున్నారని.. కావాలని అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సలహా ఇచ్చారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఇటువంటి ఇబ్బందులు ఉన్న సీఎండికి ఆ తర్వాత తనకు తెలియజేయాలని.. తాము 24 గంటలు అధికారులకు అందుబాటులో ఉంటామని వీడియో కాన్ఫరెన్ లో డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని… వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి కాల్ ను రికార్డు చేయాలి, ఆ ఫిర్యాదులకు ఏ పరిష్కారం చూపారో ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.