Site icon NTV Telugu

Bhatti Vikramarka:”తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…

Bhatti Vikramarka

Bhatti Vikramarka

కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? అని ప్రశ్నించారు.

READ MORE: Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..

తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమన్నారు.

READ MORE:Chhattisgarh: బస్తర్‌ గ్రామాల్లో స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఎగిరిన భారత జెండా..

Exit mobile version