Bhatti Vikramarka: పేదలకు మేలు చేయాలని పథకాల అమలుకు నిర్ణయం..
- కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన..,
- నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26 వతేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించాం- భట్టి
- ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశాం- భట్టి విక్రమార్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో ఈరోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26వ తేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించామన్నారు. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ.. రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన మీదటే.. ఈ పథకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే.. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశామని.. ఈ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు.
Also Read
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
- Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్‌తోనే
- India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
లబ్ధిదారుల ఎంపికను, ప్రతీ ఉమ్మడి జిల్లాలో ఇంఛార్జి మంత్రులు ఇందిరమ్మ కమిటీలతో చర్చించిన మీదటే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం నిర్ణయించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలని అన్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో రూ.22000 కోట్ల రైతు రుణ మాఫీలను చేశాం.. ఈ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలని తెలిపారు. ఈ నాలుగు పథకాలను సంబంధించి సవివరమైన మార్గ దర్శకులతో ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయాలి.. ఈ పథకాలపై జిల్లాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.
Read Also: Shraddha Srinath: బాలయ్యని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది!
తాజావార్తలు
-
Memu Kapulam: ‘మేము కాపులం’ టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
-
Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనేందుకు.. వినేష్ ఫోగాట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
-
Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్‌తోనే
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!