సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మోరల్ గా దెబ్బతీసేలా చేశారని ఫైర్ అయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా.. కట్టుకథల విషపు రాతలు.. తొలిపలుకు రాతలు.. తప్పుడు ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కథనాలు రాస్తున్నారు. రోజుకో కథ వండి వారిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Office Friends: 70 మంది ఆఫీస్ దోస్తులను పెళ్లికి పిలిస్తే ఒక్కరే హాజరు.. నిరాశతో జాబ్ రిజైన్!
ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నింటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడి దారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇటువంటి రాతలతో తెలంగాణకు సంబంధించినటువంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఎవరి కోసం కథలు రాశారో అంటూ ఫైర్ అయ్యారు. సైట్ విజిటింగ్ అనేది ఇప్పుడే పెట్టారు… వారు అనుకున్న వారికి ఇవ్వడం కోసమే కండిషన్ పెట్టారు అని రాశారని మండిపడ్డారు.
వాళ్ళు రాయడం.. ఇంకొకయాన లేఖ రాశారు.. ఇంకొకయన ఇంకో వైపు నుండి వచ్చారు.. ఏమిటి మీ ముగ్గురు ఉద్దేశం అని భట్టి ప్రశ్నించారు. సింగరేణి నిర్ణయం మంత్రుల దగ్గరికి రాదు.. అటానమస్ సంస్థ ఇది. మంత్రి మండలి దగ్గరకు కూడా రాదు.. ఇంగితం ఉన్న.. విజ్ఞానం ఉన్న వారు ఇలా రాయరు అని తెలిపారు. పారదర్శకంగా ఉండాలి అనుకోవడమే కాదు.. పారదర్శకంగా ఉండాలి అని వెంటనే టెండర్ రద్దు చేయాలి అని చెప్పానని అన్నారు. హరీష్ లేఖ రాయడం.. కిషన్ రెడ్డి విచారణ చేపట్టడం.. మంచిది అయ్యిందన్నారు. కిషన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. అడ్డగోలుగా ప్రచారం చేసే వాళ్ల బతుకు బయట పడాలని అనుకున్నానని అన్నారు.
ఎవరికి తోసింది వాళ్లు మాట్లాడుతున్నారు.. కోల్ ఇండియా 2018 లో సింగరేణి టెండర్ డాక్యుమెంట్ రాసి పంపించారు.. సైట్ విజిట్ తప్పనిసరి అని కోల్ ఇండియా పంపిందన్నారు. 2021 లో సీఎంపీడీఎల్ కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని పెట్టారు. వాటి ఆధారంగానే సింగరేణి టెండర్ లకు పిలిచారని భట్టి తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందా..? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క లేడు కదా అని తెలిపారు. Nmdc 15.5.2021 లో పిలిచిన టెండర్ లో కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని రాశారు. రైల్వే శాఖ లో కూడా టెండర్ వేసే కంపనీ సైట్ విజిట్ తప్పనిసరి అని నిబంధన ఉంది.. సైనిక్ స్కూల్.. దీన్ దయాల్ పోర్ట్ లో టెండర్ లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయని భట్టి గుర్తు చేశారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది.. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు.
