సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన…