CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఢిల్లీ జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న CJP నిరసన ఇప్పుడు పూర్తిగా బాహ్య అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. విద్యార్థుల మాటున కొందరు అసాంఘిక వ్యక్తులు గుంపులోకి చొరబడి, యూనిఫామ్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడులు చేస్తున్నారని తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదని, విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం జంతర్ మంతర్‌లో ప్రశాంత వాతావరణం కనిపించినా సాయంత్రానికి భారీగా జనసమూహం చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఆందోళనకారులు రహదారులపైకి వచ్చి రాళ్ల దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన రాళ్ల దాడిలో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు ఆఫ్ పోలీస్ (ACPలు), నలుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మొదటి ఘటనలో ఏసీపీ జై ప్రకాశ్ నుదుటికి గాయమైనట్లు వెల్లడించారు.
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
మరోవైపు CJP మాత్రం జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆరోపించింది. ప్రభుత్వం మరోసారి పోలీసులతో కఠిన చర్యలకు సిద్ధమవుతోందా అని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రశ్నించారు. నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని పోలీసు, పారామిలిటరీ బలగాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో జంతర్ మంతర్ పరిణామాలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి