ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నీటిమట్టం పెరుగుతుందనే భయంతో ఢిల్లీ యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది. శుక్రవారం సాయంత్రం నది నీటిమట్టం 205.34 మీటర్లుగా నమోదవగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి 205.17గా నమోదైంది. అయితే ఈరోజు రాత్రికి నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి యమునా నీటిమట్టం 206.70కి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది.
Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!
హథినికుండ్ బ్యారేజీ నుంచి శనివారం 2 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని యమునాలోకి విడుదల చేసినట్లు సమాచారం. గత వారం.. యమునా నీరు ఢిల్లీలో భారీ విధ్వంసం సృష్టించింది. ఎర్రకోట, ఢిల్లీ సెక్రటేరియట్, అక్షరధామ్, మయూర్ బీహార్‌తో సహా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. కొండ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా.. ఆ వరద నీరు హథినికుండ్ బ్యారేజీకి చేరుతుంది. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది.
Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు
మరోవైపు ఘజియాబాద్‌లో హిండన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హిందోన్ బీహార్, సిటీ ఫారెస్టర్ కాలనీ, కృష్ణ గౌశాల కాలనీ, నంద్ గ్రామ్ కాలనీ ప్రాంతాల్లోకి హిండన్ నది నీరు చేరింది. ఇక్కడ కూడా నది ఒడ్డున నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నది ఒడ్డున చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.