Delhi In Danger: ఢిల్లీలో గాలితో పాటు నీరు కూడా విషపూరితం
- ఢిల్లీలో గాలితో పాటు నీరు కూడా విషపూరితం.
- యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు
- డేంజర్ లో రాజధాని ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi In Danger: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యపు విషం మితిమీరిపోతుంది. అయితే, వాతావరణ కాలుష్యమే కాకుండా నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. ఓ వైపు ఢిల్లీ గాలి కలుషితమై ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంటే., మరోవైపు యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం మొదలైంది. ఓ నివేదిక ప్రకారం.. నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా పండుగ సమయంలో పూజించే వారికి ఇది ప్రమాదకరం. ఇదివరకు వర్షాలు బాగా కురవడంతో నదిలో గతంలో కంటే ఆక్సిజన్ స్థాయి పెరిగింది. కానీ, దీనితో పాటు నదిలో ఫీకల్ కోలిఫాం స్థాయి కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా యమునా భయానక వీడియో ఒకటి బయటపడింది. ఇందులో నదిలో నురుగు మాత్రమే కనిపిస్తుంది. మంచు నుండి కనిపించే ఈ నురుగులు నదిలో చాలా దూరం వ్యాపించి ఉన్నాయి. నదిలో నీరు తక్కువగా ఉండి నురగ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో కాళింది కుంజ్ ప్రాంతానికి చెందినది.
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు ప్రత్యక్ష ప్రసారం..
Also Read
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Tilak Varma: "ఇది కదా తెలుగోడి పవర్".. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
- Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
తెల్లటి నురుగు మందపాటి పొర యమునాలో పడే మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యర్థాల నుండి తయారవుతుంది. ఈ తెల్లని నురుగుకు ఒక ప్రధాన కారణం చిన్న, పెద్ద కర్మాగారాల నుండి వెలువడే రసాయన వ్యర్థాలు. ఇది కాలువల ద్వారా యమునాలోకి వస్తుంది. వాస్తవానికి, ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల కూడా ఈ పొర ఏర్పడుతుంది. వీటివల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. అయితే, ప్రభుత్వ అధ్వాన్నమైన వైఖరి కారణంగా యమునాను శుభ్రం చేయలేకపోతున్నారు. యమునా నదిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ, ఆ డబ్బు బహుశా కాగితాలకే ఖర్చు అవుతుంది కాబోలు. దాని ప్రభావం యమునా నీటిలో కనిపించదు. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ యమునా నదిలోని అన్ని ప్రాంతాల నుంచి యమునా నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా, యమునా నీటి నమూనాల పరీక్షా రిపోర్టు రావడంతో దిగ్భ్రాంతి కలిగించింది.
Jharkhand Assembly Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, మిత్రపక్షాల సీట్ల ఖరారు
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River. Visuals from Kalindi Kunj. pic.twitter.com/5KSQRjerSC
— ANI (@ANI) October 18, 2024
తాజావార్తలు
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!