Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ!
- సోనియా గాంధీ, రాహుల్లకు షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.
- ఇతర ప్రతిపాదిత నిందితులకు కూడా నోటీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఇతర ప్రతిపాదిత నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన చార్జ్‌షీట్‌పై కోర్టు వాదనలు వినేందుకు ఇచ్చినవిగా పేర్కొంది.
Read Also: Vivo Y19 5G: రూ.10,499 లకే 6.74 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ ఉన్న వివో స్మార్ట్ ఫోన్
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఈ విషయమై కోర్టు తెలిపిన ప్రకారం.. ఈ కేసు సంబంధించి ఇప్పటికే చార్జ్‌షీట్‌లో ఉన్న లోపాలను తొలగించారని పేర్కొంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే.. భారతీయ నగరిక సురక్షా సంహిత (BNSS) లోని సెక్షన్ 223 ప్రకారం నోటీసులు జారీ చేయాలా అనే అంశమేనని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసును తదుపరి విచారణ 2025 మే 8 కు వాయిదా వేసారు. అయితే, ఈ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కోర్టు ముందు వాదనలు వినిపించే హక్కు ఉందని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఇది BNSS సెక్షన్ 223 ప్రకారం వచ్చే ప్రత్యేక హక్కు అని పేర్కొంది. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనలకు వ్యతిరేకంగా కాదని కోర్టు అభిప్రాయపడింది.
అలాగే, తదుపరి దశలలో న్యాయమైన విచారణ కోసం ఈ హక్కు కీలకమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ దశలో ఆరోపణలపై వాదనలు వినడమే న్యాయపరమైన న్యాయ విచారణకు ప్రాణం పోసే అంశమని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తెలిపిన విషయమేమిటంటే.. ప్రస్తుత దశలో నోటీసుల జారీకి ఈడీ వ్యతిరేకం కాదని, న్యాయపరమైన విచారణ సూత్రాలను మద్దతిస్తున్నామని తెలిపారు.
Read Also: iPhone- India: భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే ధరలు తగ్గుతాయా?
ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు క్రిమినల్ కూనస్యిరసీ పథకాన్ని అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకారం రూ. 2,000 కోట్లకు పైగా విలువ ఉన్న ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థను సోనియా, రాహుల్ నియంత్రిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు సామ్ పిత్రోడా, సుమన్ దుబే లను కూడా ఆరోపణలతో చేర్చారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!