Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు.. ఇందుకు మీరు సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు.
Read Also: Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే
Also Read
ఆదివారం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సిబిఐ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సిసోడియాను మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ అంతకు ముందు ఆరోపించారు. జైల్లో సిసోడియాకు ఈ వేధింపులు తప్పడంలేదన్నారు.
Read Also: టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
ఈడీ, సిబిఐ సంస్థలు కేంద్ర ఆదేశాలపై పని చేస్తున్నాయని, గత ఎనిమిదేళ్లలో ఇవి కనీసం మూడు వేలసార్లు దాడులు నిర్వహించాయని ఆయన అన్నారు. 95 శాతం దాడులు విపక్ష నేతలపైనే జరుగుతూ వచ్చాయన్నారు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నేతలు తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ ఆప్ చీఫ్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాయచూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేజ్రివాల్ మాట్లాడారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?