CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- CJP నిరసనల సమయంలో తప్పుడు కంటెంట్ ప్రచారం..
- పాక్ నుంచి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫేక్ కంటెంట్..
- భారతీయులుగా నటిస్తూ తప్పుడు ప్రచారం..
- 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ‘‘ఫేక్ కంటెంట్’’ ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఇలా నకిలీ వార్తల్ని, కథనాలను ప్రచారం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌కు చెందిన పలు సోషల్ మీడియా అకౌంట్లు ఈ తప్పుడు కథనాల వ్యాప్తిలో చురుకుగా పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. అక్టోబర్ 10న SIR నిరసనల్లో మరణాలు సంభవించాయంటూ కొన్ని అకౌంట్లు ఫేక్ ప్రచారం చేశాయని పోలీసులు చెబుతున్నారు. భారతీయులుగా నటిస్తూ నకిలీ వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు గుర్తించారు. పుకార్లను వ్యాప్తి చేస్తూ.. ప్రజల్లో ఆందోళన, అశాంతి సృష్టించే అవకాశం ఉన్నట్లు భావించిన సుమారు 500 సోషల్ మీడియా పోస్టుల్ని తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు విమానంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి రోజు షరతులపై విడిచిపెట్టారు. మరోవైపు, సోమవారం సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతలు మార్చ్‌గా వెళ్లారు. దీనిపై కూడా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!