IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. రిటైన్ లిస్ట్ ఇదే!
- నవంబర్ నెలలో మెగా వేలం
- రిటెన్షన్ లిస్ట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ దృష్టి
- ఢిల్లీ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Retained Players for IPL 2025: నవంబర్ నెలలో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా తన జట్టును సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను ఢిల్లీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఓ స్టార్ ప్లేయర్లతో పాటు ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తన రిటెన్షన్ జాబితాలో ప్రథమ ఎంపికగా రిషబ్ పంత్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ ఐపీఎల్ ధర రూ.16 కోట్లు. అయితే ఈసారి మరింత ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని ఢిల్లీ సిద్ధంగా ఉందట. ఇటీవల ఈ విషయం గురించి ముంబైలో ఫ్రాంచైజీ సహయజమాని పార్త్ జిందాల్‌తో పంత్ చర్చించాడట. 20 కోట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలలు ఆటకు దూరమైన పంత్.. ఐపీఎల్ 2024 ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇవ్వడమే కాదు కెప్టెన్, బ్యాటర్, వికెట్ కీపర్‌గా ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 155 స్ట్రైక్‌రేటుతో 446 పరుగులు చేశాడు. భారత జట్టులో కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
Also Read
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకుందని సమాచారం. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రిటైన్ చేసుకోవాలని కూడా భావిస్తోందట. ఫ్రేజర్, స్టబ్స్ విదేశీ హిట్టర్లు కాగా. పోరెల్ భారత వికెట్ కీపర్. పోరెల్ దేశవాళీలో సత్తాచాటుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తోందని తెలుస్తోంది. ఓవర్సీస్ ప్లేయర్లు, అన్‌క్యాపడ్ ప్లేయర్ల నిబంధనలు ఖరారైతే క్లారిటీ రానుంది.
రిటైన్ లిస్ట్ (Delhi Capitals Retention List):
రిషబ్ పంత్
కుల్దీప్ యాదవ్
అక్షర్ పటేల్
అభిషేక్ పోరెల్
జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్
ట్రిస్టన్ స్టబ్స్
తాజావార్తలు
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!