బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ దీపికాకు భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఎలాంటి ఫోటోలు పెట్టినా నెటిజన్లు స్పందిస్తుంటారు. రణ్‌వీర్‌సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా దీపికా పదుకునేను లక్షలాది మంది అభిమానులు ఇష్టపడుతున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీపికా పదుకునే డ్రెస్సింగ్ స్టైలును చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. ఆమె వేసుకునే ఫ్యాషన్ డ్రస్సులకు కుర్రకారు ఫిదా అయిపోతుంది.
Read Also: “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్
అయితే తాజాగా డ్రెస్సింగ్ విషయంలో దీపికాకు చుక్కెదురైంది. ఆమె ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ప్యాంట్, షర్ట్ వేసుకుని మీడియాకు దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ఫోటోల్లో దీపికా బ్లూడెనిమ్ జాకెట్, లైట్ బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్ ధరించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఆమె కాళ్లకు హీల్స్, అలాగే సాక్స్ కూడా ఫోటోలో కనిపించాయి. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. సాక్సు వేసుకుని హీల్స్ వేసుకోవడాన్ని నెటిజన్లు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. భర్త రణ్‌వీర్‌సింగ్ బట్టలు వేసుకొచ్చావా అంటూ కొందరు విమర్శిస్తే.. సాక్సులతో హీల్స్ వేసుకోవడమేంటని మరికొందరు కామెంట్లు చేశారు. ఇలాంటి ఫ్యాషన్‌ను యూత్ ఫాలో కావొద్దని పలువురు హితవు పలికారు. ఇటీవల కాలంలో దీపికా పదుకునేపై ఇలాంటి ట్రోల్స్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
