NTV Telugu Site icon

Deepak Niwas Hooda: కబడ్డీ మాజీ ప్లేయర్ దీపక్ హుడాను చితకబాదిన భార్య స్వీటీ బూరా (వీడియో)

Deepak Hooda

Deepak Hooda

భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

READ MORE: Neha Kakkar: స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!

వాస్తవానికి.. హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మోసం, దాడి, వరకట్న వేధింపుల కేసులో ఇరువర్గాలను విచారణకు పిలిచారు. అంతర్జాతీయ బాక్సర్ అయిన స్వీటీ, ఆమె మామ, తండ్రితో కలిసి తనను కొట్టారని దీపక్ ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు ఆధారంగా, సదర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25న స్వీటీ తనపై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. “ఈ విషయంలో విచారణ కోసం మార్చి 15న నన్ను హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. స్వీటీ, ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సమయంలో, నాకు, స్వీటీకి మధ్య గొడవ జరిగింది. అది తీవ్రం కావడంతో, స్వీటీ నాపై దాడి చేసింది. ఆమె తండ్రి, మామ కూడా చేరారు. నాకు గాయాలు అయ్యాయి. నేరుగా హిసార్‌లోని సివిల్ ఆసుపత్రికి వెళ్లాను. చికిత్స పొందిన తర్వాత, మార్చి 16న సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.” అని దీపక్ పేర్కొన్నారు.

READ MORE: Neha Kakkar: స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!