NTV Telugu Site icon

Kerala News: కేరళ ఘటనలో 30కి చేరిన మరణాల సంఖ్య..సీఎంకి మోడీ ఫోన్

Kerala

Kerala

భారీ వర్షాల మధ్య కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో 100 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. దీని తర్వాత తెల్లవారుజామున 4.10 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

READ MORE: Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..

ఇప్పటివరకు 30 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ ఫారినర్ ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. కాగా నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేరళ సీఎం విజయన్ తో ప్రదాని మోడీ ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.. అవసరమైన అన్ని సహాయాలు కేంద్రం చేస్తుందన్నారు. ముండక్కై, చూరల్‌మల, అత్తమాల, నూల్‌పుజా గ్రామాలు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

READ MORE:Credit Card New Rules :హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్‌ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు

నేషనల్ హెల్త్ మిషన్ ఇక్కడ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9656938689.. 8086010833 కూడా జారీ చేయబడ్డాయి. తమిళనాడులోని సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు Mi-17, ఒక ALH ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

READ MORE:Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!

ఆర్మీ బృందాన్ని మోహరించారు..
ప్రమాదం యొక్క పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. నాలుగు బృందాలను సమీకరించారు. వీటిలో 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) రెండు కాంటెంజెంట్లు, కన్నూర్‌లోని డీఎస్‌సీ సెంటర్‌కు చెందిన రెండు కంటెంజెంట్లు ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు మోహరించిన మొత్తం దళాల సంఖ్య 225, ఇందులో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.