పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి…