Site icon NTV Telugu

Tragedy: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రుల శవాలు లభ్యం

Suicide

Suicide

Tragedy: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండకట్ల అనిల్, దేవి దంపతులు. గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి లోహిత(3), జశ్విత(11నెలలు) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.

Read Also: Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన నిందితుడి అరెస్ట్

గత మార్చి 10వ తేదీన కుటుంబ కలహాలతో తమ ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి హత్య చేసి ఇంట్లో నుంచి పరారయ్యారు. నేడు అడ్డగుట్ట అడవుల్లో అనిల్ -దేవి మృతదేహాలు లభ్యం అయ్యాయి. వారిద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు.

Exit mobile version