నగరంలోని సెల్‌ఫోన్ టవర్లపై పరికరాలను చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ మీడియా తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్నారని, ఈ పరికరాలు మొబైల్ టవర్స్ లో వాడతారు.. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు అత్యవసరమని ఆమె తెలిపారు. అయితే.. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, కాచిగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు…