Swag : విష్ణు స్వాగ్ మూవీ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swag : శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఓం భీమ్ బుష్ అనే ఓ హారర్ కామెడీ సినిమాతో శ్రీవిష్ణు హిట్ కొట్టాడు. మరోసారి ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో రాబోతున్నట్లు ఇటీవల విడుదల చేసిన స్వాగ్ మూవీ టీజర్ చూస్తే తెలుస్తోంది. స్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ టీజర్ మొదటి నుంచీ చివరి వరకూ నవ్విస్తూనే ఉంది. శ్రీ విష్ణు తన స్వాగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని అర్థం అవుతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా.
Read Also:Bandi Sanjay: బుల్డోజర్లు ముందు మా మీద.. ఆ తరువాత పేదల ఇళ్ల వద్దకు..
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
శ్రీ విష్ణు ఈ సినిమాలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు క్యారెక్టర్లలో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. రెండు కాలాల మధ్య సాగే కథగా తెలుస్తోంది. అయితే గతేడాది సామజవరగమన, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ లతో వరుస హిట్స్ కొట్టిన శ్రీ విష్ణు.. ఈ స్వాగ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూ వర్మతోపాటు సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించనుంది. సునీల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
Read Also:Arani Srinivasulu: గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘శ్వాగ్’ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో రాబోతుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్ తో పాటు దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!