ధరణి పథకంపై అనవసరమైన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ని రానున్న ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపడం తప్పదని ఖైరతాబాద్ బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 పెన్షన్ పెంచడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు శనివారం స్థానిక ఫిలింనగర్ లోని చౌరస్తాలో దివ్యాంగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ దేశంలో ఎవరు అమలు చేయలేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
JP Nadda: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..
దివ్యాంగుల పరిస్థితులను అర్థం చేసుకొని ఎవరు అడక్కుండానే దివ్యాంగుల కొరకు వేయి రూపాయల పెన్షన్ పథకం అమలు చేయడంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎవరు చేయలేని మహోన్నతమైన పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఎన్నికల్లో 100 సీట్లు తప్పక గెలుస్తామని కాంగ్రెస్ బిజెపి పార్టీలను బంగాళాఖాతంలో కలప తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Rajinikanth – Amitabh: మెగా క్రేజీ కాంబో.. రజినీ సినిమాలో అమితాబ్ బచ్చన్?