రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని తన కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ గారితో శాఖ పరమైన అంశాల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. సానుకూలంగా స్పందించారు. ఇటీవల కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై చర్చించారు. ఈ ఘటన లో వైద్యుల సస్పెన్షన్ పై జేఏసీ ప్రతినిధులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ నివేదిక తెప్పించుకొని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
Poonam Pandey: మా మనోభావాలు దెబ్బ తీసింది.. 100 కోట్లు కట్టాలంటూ పూనమ్ పాండేపై దావా
రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లు, వైద్య సిబ్బంది ల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు పలు అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఆరోగ్య పరిరక్షణ, వైద్య భద్రత ను కల్పించేలా డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు చేసిన పలు అంశాల పై రాష్ట్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బొంగు రమేష్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఎం. శ్రీనివాస్, జేఎసి నాయకులు డాక్టర్ రంగా, డాక్టర్ రహుఫ్, డాక్టర్ వినోద్, డాక్టర్ అబ్బయ్య , డాక్టర్ వసంత్ లు పాల్గొన్నారు.