LEO : దళపతి విజయ్ ‘లియో’ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదలయింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్ కెరీర్లోనే భారీ హిట్‌గా నిలిచింది. లియో సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లియో ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి రీసెంట్ గా పలు వార్తలు వచ్చాయి.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ నవంబర్ 17న వస్తుందని, లేదు ఈ సినిమా నవంబర్ 21న స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లియో మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా రెండు తేదీలను ప్రకటించింది. భారత్‌లో నవంబర్ 24 నుంచి లియో స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.భారత్‌లో నవంబర్ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో లియో స్ట్రీమింగ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ మరియు జగదీష్ పళని స్వామి భారీ బడ్జెట్‌తో లియో ను నిర్మించారు. మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, జార్జ్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, బాబూ ఆంటోని మరియు లీలా శామ్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!