Site icon NTV Telugu

Daggubati Purandeswari: వైసీపీ, కాంగ్రెస్‌, టీడీపీకి చెప్పేది ఒక్కటే.. తప్పులు చేసేది మీరు.. మాపై విమర్శలా..?

Daggubati Purandeswari

Daggubati Purandeswari

Daggubati Purandeswari: వైసీపీ, కాంగ్రెస్‌, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏక కాలంలో 25 పార్లమెంట్ బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. 2024 ఎన్నికల నగారా మోగించాం.. కార్యకర్తలను గౌరవించుకునే పార్టీ బిజెపి.. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలయ్యి.. 1,300 ప్రాంతీయ, 7 జాతీయ పార్టీల కంటే బీజేపీ భిన్నమైంది.. అధికారంలోకి రాలేము అనుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో విజయాన్ని బీజేపీ నమోదు చేసింది.. బీజేపీ అధికారంలోకి రాక ముందు దేశంలో స్కాంలు మాత్రమే ఉండేవి.. బీజేపీ అధికారంలో వచ్చాక పేదల సంక్షేమం కోసం స్కీమ్‌లు తీసుకువచ్చారని తెలిపారు.

Read Also: Nallapareddy Prasanna Kumar Reddy: డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఫ్యాన్‌కు వేయండి..

ఇక, బీజేపీ అధికారంలో వచ్చిన 10 ఏళ్ల కాలంలో అవినీతి లేని పాలన అందించాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 350 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారని తెలిపారు పురంధేశ్వరి.. ఆంధ్ర రాష్ట్రంలో విద్వేష, విధ్వంసకర పాలన కొనసాగుతుందన్నారు. ఏపీలో గుళ్లు, గుళ్లల్లో విగ్రహాలను కూలగొడుతుంది.. రాష్ట్రంలో నియంతృత్వ పాలనలో గళంవిప్పిన వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు.. బాపట్లలో అక్కని కాపాడుకుందామని వెళ్లిన బీసీ కులానికి చెందిన చిన్న బిడ్డను కాల్చి చంపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తలకాయ లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఉంచారని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని అని కేంద్రం భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బీజేపీకే ఉందన్నారు.

Read Also: Budget-2024: వందే భారత్‌ కోచ్‌ల తరహాలో కొత్తగా 40 వేల బోగీలు

పోలవరం జాతీయ హోదా కల్పించిన తర్వాత ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు చేస్తోందన్నారు పురంధేశ్వరి.. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగినా కాంట్రాక్టర్ ను తొలగించకుండా జాప్యం చేసిందన్నారు.. వైసీపీకి, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Exit mobile version