Site icon NTV Telugu

Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీదే.. ఈసారి ఎంపీల సంఖ్య 350 దాటుతుంది..!

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా పారిశామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని వైసీపీ నేత కేతా అమర్నాథ్‌ రెడ్డితో పాటు పలువరు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలో బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Pushpa 2: ఫ్యాన్స్ కు ప్రామిస్… పుష్ప 2 అంతకు మించి ఉంటుంది

ఇక, దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ (సీఈసీ)కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధేశ్వరి.. ఐపీఎస్ ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారు.. అభ్యర్ధిని మార్చడంతో పాటు, ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయిల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయి అని విమర్శించారు. మరోవైపు.. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీ చేసిందే అన్నారు.. పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య ఈ సారి 350 దాటుతుందన్న ఆమె.. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలు అన్నీ కేంద్ర పథకాలు అని మేం చెప్పినా.. మాకు సహకారం ఇవాళ్టి వరకూ లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Exit mobile version