Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీదే.. ఈసారి ఎంపీల సంఖ్య 350 దాటుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా పారిశామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నేత కేతా అమర్నాథ్ రెడ్డితో పాటు పలువరు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలో బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Pushpa 2: ఫ్యాన్స్ కు ప్రామిస్… పుష్ప 2 అంతకు మించి ఉంటుంది
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇక, దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ (సీఈసీ)కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధేశ్వరి.. ఐపీఎస్ ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారు.. అభ్యర్ధిని మార్చడంతో పాటు, ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయిల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయి అని విమర్శించారు. మరోవైపు.. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీ చేసిందే అన్నారు.. పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య ఈ సారి 350 దాటుతుందన్న ఆమె.. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలు అన్నీ కేంద్ర పథకాలు అని మేం చెప్పినా.. మాకు సహకారం ఇవాళ్టి వరకూ లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!