NTV Telugu Site icon

Daggubati Purandeswari : పీడిఎస్ పై పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందని, సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రజలు గమనించారని అన్నారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిందని, జార్ఖండ్‌లో ఓటు శాతం 33% పెరిగిందని పేర్కొన్నారు.

TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..

పీడిఎస్ పై పవన్ కళ్యాణ్ చర్యలు సరైనవే అని, గత ప్రభుత్వ హయాంలో కూడా మేం పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామన్నారు. అంతర్జాతీయ పీడిఎస్ మాఫియా గా పవన్ మాటలు తప్పు కాదని ఆమె వ్యాఖ్యానించారు. మా పార్టీ నుంచీ ఆదినారాయణ రెడ్డి సీఎం ని కలిసారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కలవలేదని తెలిసిందన్నారు పురందేశ్వరి. సీఎం చంద్రబాబు ఈ అంశం పై చర్యలు తీసుకుంటారని, రాజ్యాసభ ఎవరికి అనేదానిపై అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు పురందేశ్వరి. రాజమండ్రిలో టూరిజం అభివృద్ధి కి కేంద్రం తోడ్పాటు అందిస్తోందని, జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ ల అంశం పూర్తి చేయకుండా రోడ్లు వేసుకుంటూ పోలేము కదా అని ఆమె వ్యాఖ్యానించారు.

Beerla Ilaiah: గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం