Cyclone Mandous in Tamil Nadu : మాండూస్ తుపాను తమిళనాడు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా రవాణాకు ఆటంకం ఎదురైంది. మాండూస్ తుపాను కారణంగా పది విమానాలు రద్దయ్యాయి. తమిళనాడులో మాండౌస్ తుఫాన్ తీరానికి దగ్గరైంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అప్రమత్తమైన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
Read Also: Supreme Court: యూట్యూబ్లో నగ్న ప్రకటనలు.. సుప్రీంకోర్టులో దావా వేసిన యువకుడు
సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులను నియమించి వారిని క్షేత్ర స్థాయికి పంపింది. చెన్నైలో మాండూస్ తుఫాన్ను ఎదుర్కొనేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్.. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉందన్నారు. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే తమ బృందం వెంటనే అవసరమైన చోటుకు వెళుతుందని ఆయన తెలిపారు. తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయంలో ఉదయం నుంచి దాదాపు పది విమానాలు రద్దయ్యాయి. మరో 13 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లను, బస్సర్వీసులు సైతం పాక్షికంగానే నడిచాయి. కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది.
Tamil Nadu | Chennai receives continuous moderate rain as a result of cyclone #Mandous pic.twitter.com/ZEt9tf29Ib
— ANI (@ANI) December 9, 2022
Rough seas.
Today. At Pulicat, Tiruvallur. pic.twitter.com/fPmsgHJO8N— Dr Alby John (@albyjohnV) December 9, 2022