Cyclone Effect: ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొబ్బిలి, సాలూరు, భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. లక్షల రూపాయు పెట్టుబడి నేలపాలయ్యింది. ప్రతి ఏటా అరటి సాగుపై ఎకరాకి యాభై నుంచి లక్ష రూపాయలు లాభం వచ్చేది. కానీ, ఇప్పుడు పూర్తిగా పంట నేలపాలైంది.
ఇందులో సాలూరుకు చెందిన ఓ రైతు తన 25 ఎకరాల భూమిలో అరటి సాగు చేసి, కోత దశకు తీసుకువచ్చాడు. అయితే గాలులకు పంట మొత్తం నేలకూలిపోయింది. తుఫాన్ ధాటికి లక్షల రూపాయల పెట్టుబడులు నీళ్లలో కలిశాయి. ఎన్నో ఆశలతో సాగు చేశాం, కానీ అంతా ఒక్కరాత్రిలోనే అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు సదరు రైతు. స్థానికంగా పలువురు రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
Tollywood Actress : ఆ ఇద్దరి భామల ముద్దుల కోరికను ఆ హీరో నెరవేరుస్తాడా?