Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu letter to Amit Shah: అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరితగతిన పంపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని సీఎం వెల్లడించారు.
తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 16 జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), 11 రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలను అందుబాటులో ఉంచినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాన్ ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు వివరించారు.
Also Read
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
- Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
- Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనాలను కేంద్ర హోం మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు నేలకొరిగాయని తెలిపారు. తీర ప్రాంతాల్లో అనేక చోట్ల రహదారులు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు తాగునీరు అందించడం, విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభించడం, రహదారులపై అడ్డంకులను తొలగించడం వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
అర్నబ్ తుఫాన్ రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీటమునిగినట్లు వెల్లడించారు. మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి వివరాలు సేకరించిన అనంతరం నష్టానికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు.
కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో పాటు బాధితులకు సహాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని లేఖలో వివరించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం కోరారు. తుఫాన్ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నష్టం తీవ్రతపై సమగ్ర అంచనా పూర్తయిన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!