NTV Telugu Site icon

UP: సైబర్ వలలో చిక్కకున్న మంత్రి.. ఏకంగా రూ.2 కోట్ల 8 లక్షలు మోసం

దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

READ MORE: Sanju Samson Six: సంజూ శాంసన్ భారీ సిక్స్.. మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి.. వీడియో

అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ సమాచారం ప్రకారం.. మంత్రి నంది కుమారుడిగా చూపించి సైబర్ దుండగులు మోసం చేశారు. మంత్రి కుమారుడిలా నటిస్తూ… “నేను బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాను. డబ్బు కావాలి. త్వరగా డబ్బులు పంపండి.”అని చెప్పాడు సైబర్ నేరగాడు. దీంతో మంత్రి కుమారుడు డబ్బులు బదిలీ చేయమని అడుగుతున్నట్లు గుర్తించిన అకౌంటెంట్ సైబర్ దుండగులు ఇచ్చిన నంబర్‌కు నగదు బదిలీ చేశాడు. అకౌంటెంట్ డబ్బును ఒకటి కాదు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. మోసగాళ్లకు డబ్బును బదిలీ చేసిన తర్వాత.. అతను డబ్బు పంపిన నంబర్లు మంత్రికి లేదా అతని కుమారుడికి సంబంధించినవి కాదని గుర్తించాడు. అతను భయపడి సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: TSPSC Group-3: రేపటి నుంచే గ్రూప్‌–3 పరీక్షలు.. రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ ..